ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది. అందుకనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. రేపో మాపో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేంద్ర సర్వీస్‌ల నుంచి వచ్చిన వెంకట రెడ్డికి ఇవాళ్టితో డిప్యూటేషన్ పూర్తి కావాల్సి ఉంది. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. న్యాయ సలహా తీసుకుని గత రాత్రి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డి పై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.