మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు కలక్టరేట్ ఎదుట మాజీ కేంద్ర మంత్రి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ అయిదేళ్ల పాలనలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆర్ధిక, రెవెన్యూ వ్యవస్థలని నాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనకు ఏపీలో ఒక కుటుంబం, తెలంగాణలో ఒక కుటుంబమే కారణమన్నారు.