ఎమ్మార్సీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దత్తిరాజేరు ఏవో అనూరాధ హెచ్చరించారు. బుధవారం మండలంలోని మానాపురంలోని కొల్ల నరసింహస్వామి అండన్ సన్స్ ఎరువుల షాపులోస్టాక్ రిజిష్టర్, బిల్‌బుక్స్, గోదాములను తనిఖీ చేశారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని తెలిపారు. ఎరువుల నాణ్యత పరిశీలన కోసం సాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆమె వెంట వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.