రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ హెచ్ ఎల్ సి ఆయకట్టుకు తుంగభద్ర జలాల వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నాటికి1, 98, 109 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యాం 33 గేట్లను ఎత్తి1, 65, 915 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1631 అడుగులకు నీరు చేరింది.