ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపట్నంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ బాత్రూంలోనే ప్రసవించింది. అయితే పుట్టిన శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది డీఈసీ, పోలీసులకు సమాచారమిచ్చి.. విద్యార్థినిని ఒంగోలులోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.