ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.వైసీపీ నేతలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారయినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.జగన్ నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.నంద్యాల, జగ్గయ్యపేటలలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అచ్చెన్నాయుడు అన్నారు.ఆంధ్రప్రదేశ్ ను అయిదేళ్లలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది జగన్ కాదా? అని అచ్చెన్న ప్రశ్నించారు.వైసీపీ పాలనలో ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకూ దాడులు, దౌర్జన్యాలు జరగని రోజే లేదని అచ్చెన్న విమర్శించారు.