దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైన నెలల్లో శ్రావణం ఒకటి. శివ, కేశవుల బేధం లేకుండా పూజించే మాసం ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైమనవి. సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం.. కార్తీకమాసం, శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈనెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం, బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని మహిళలు విశ్వసిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa