గ్రామస్తులు సహకరిస్తే తిమ్మాయ పాలెం నుండి కొత్తపల్లి వరకు నూతనంగా రోడ్డు వేయిస్తానని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు అన్నారు. సోమవారం కొత్తపల్లి నుండి తిమ్మాయ పాలెం వరకు కాలినడకన నడుచుకుంటూ వెళ్లి బాటను పరిశీలించారు. వ్యవసాయ పొలంలో దారి వేయాల్సి ఉన్నందున గ్రామస్తులు ఒప్పుకుంటే అధికారులతో మాట్లాడి రోడ్డు వేయిస్తానని ఆయన అన్నారు.