విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మున్నా సోమవారం సాయంత్రం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ , గురుకుల తదితర హాస్టలలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న అమ్మఒడి , విద్యా దీవెన , వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని మున్నా డిమాండ్ చేశారు.