చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ఐదు వినతులు అందినట్లు నగర కమిషనర్ డా. జె అరుణ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ రామకృష్ణుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్య విభాగం -1, మెప్మా-2, రెవెన్యూ -2 చొప్పున మొత్తం ఐదు వినతులు అందాయి. వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa