అన్నమయ్య జిల్లా రాజంపేట పాత బస్టాండ్ లో అక్రమంగా నిర్మించిన రూములు తొలగించి ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చేయాలని మండల అధ్యక్షుడు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు మున్సిపల్ కమిషనర్ రాంబాబు మంగళవారము దృష్టికి తీసుకెళ్లారు. అలాగే గత వైసిపి ప్రభుత్వం లో మునిసిపాలిటీలో విధుల నుంచి తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.