వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియా రూమ్‌ను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాల కోసం ప్రత్యేకంగా రూమ్‌ను సిద్దం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా రూమ్‌ను శాసనమండలిలో ప్రతిపక్షనేత లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు ప్రారంభించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘పేదలకు ఇచ్చిన స్థలాలను చంద్రబాబు రద్దు చేయడం ఏంటి? అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చాక అందరిని సమన్యాయం చేయాలని హితవు పలికారు. కులాలు,మతాలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అందిచ్చారు. చంద్రబాబు రెండు నెలల పాలన చూస్తేనే ఏం జరగబోతుందో అర్థమవుతోంది. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ మేరుగ నాగార్జున చెప్పారు. ‘‘రాష్ట్రంలో దాడులు పెట్రేగిపోతున్న చంద్రబాబు పట్టించుకోవడంలేదు. దాడులు నివారించే ఆలోచనే చంద్రబాబుకు లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచిదికాదు. మా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని మేరుగ నాగార్జున భరోసా ఇచ్చారు.