వ్యవసాయ భూముల మాదిరిగానే ఆబాదీ/గ్రామ కంఠం భూముల్లోని నివాస స్థలాలకు కూడా ‘భూధార్’ను కేటాయించనున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాల్లో దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. తెలంగాణలోనూ చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్వోఆర్ చట్టంలో సెక్షన్లను జోడించింది. డ్రోన్ సర్వే చేపట్టి పక్కాగా రికార్డులను రూపొందించనున్నారు. ఈ స్థలాలకు కూడా విశిష్ట సంఖ్యను కేటాయించడం ద్వారా రుణాలు, తాకట్టు, క్రయవిక్రయాల సందర్భంగా యజమానులకు సులువుగా సేవలు అందనున్నాయి.