బొమ్మనహాళ్: అనంతపురం జిల్లాకి సాగు, తాగునీరు అందిస్తున్న కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో 102. 335 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం 84, 696 క్యూసెక్కుల ఇన్ప్లే కొనసాగుతోంది. 12 క్రస్ట్ గేట్లు రెండు అడుగులు ఎత్తినదికి, కాలువలకు కలిపి మొత్తం 55, 227 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు, హెచ్చెల్సీ ఆంధ్రా సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద 1, 300 క్యూసెక్కుల నీటిప్రవాహం కొనసాగుతోంది.