పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షించారు. పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని, విద్యాప్రమాణాల మెరుగుదలకు పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కెజిబివి స్కూళ్లలో టీచింగ్ పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని, ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశించారు.సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా సత్కరించబోయే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో నాతోపాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.