విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఇబ్బందులు ఉన్నాయని వదిలిపెట్టలేదు. ఇచ్చిన మాట ప్రకారం 5 సంతకాలు పెట్టి వెంటనే అమల్లోకి తెచ్చాం. మెగా డీఎస్‌సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు పెంచిన పింఛన్లు రూ.4 వేలు ఇస్తున్నాం. ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. ఈ నెల 15న ఒకేసారి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ సెన్సస్ చేస్తున్నాం. ఇసుక విషయంలో ఐదేళ్లుగా పేదలను అనేక కష్టాలు పెట్టారు. ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తామన్నాం.. ఇస్తున్నాం.97 వేల మంది నేతన్నలకి, 50 ఏళ్ళకే రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. స్కిల్ డిజైన్ నేర్పించి, ఆదాయం పెంచే విధానం తీసుకుని వస్తాం. చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య భీమా కోసం, రూ.10 కోట్లు వెంటనే ఇస్తున్నాం. పొదుపు నిధిలో త్రిఫ్ట్ ఫండ్ లో, రాష్ట్ర ప్రభుత్వ వాటా 8% నుంచి 16% పెంచి, నేతన్నల భవిష్యత్తు అవసరాలకు దోహదపడతాం. రూ.70 కోట్ల వరకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం. గ్రూపుగా మగ్గం పెట్టుకోవటానికి స్థలం ఇస్తాం. ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు, మగ్గాలు ఏర్పాటు చేసుకోవటానికి రూ.4.30 లక్షలకు అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. ఉత్పత్తులకు సరైన ధర రావటానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ప్రైవేటు రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా సహకరిస్తాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం.