శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు గ్రామ దగ్గర ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, గర్ల్స్ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు యూనివర్సిటీ భవన నిర్మాణాలను పరిశీలించారు.2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమైనది.2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీని పట్టించుకోకుండా మూలకేసింది,ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.2024 సం.లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నిలబడిపోయిన భవనాల నిర్మాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి.శరవేగంగా పనులు పూర్తి అవుతున్నాయని ఇంత ప్రతిష్టగాంచిన యూనివర్సిటీ శింగనమల నియోజకవర్గం లో ఏర్పడడం ఎంతో అదృష్టమని తెలిపారు.అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ కావాలని.. ఆరోజు చంద్రబాబు గారు చేసిన ప్రయత్నమే ఈరోజు మనకు ఈ యూనివర్సిటీ వచ్చిందని తెలిపారు.ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడ విద్యనభ్యసిస్తారు,శింగనమల నియోజకవర్గానికి ఇది ఒక ఐకాన్ గా మారుతుంది.ఆరోజు చంద్రబాబు ఈ యూనివర్సిటీ ని తీసుకొచ్చారు.ఇప్పుడు పూర్తి చేసేది కూడా చంద్రబాబు గారు సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు.