పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేద్దాం అని లోకేష్ పిలుపు ఇచ్చారు.