కందుకూరులో అంకమ్మ తల్లి టీ స్టాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగల బెట్టారు. టీ స్టాల్ యజమాని బుధవారం రాత్రి ప్రాంతంలో షాపు మూసి వేసి ఇంటికి వెళ్లిన తరువాత దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని షాపు యజమాని కృష్ణారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపులో ఉన్న విలువైన సిగిరెట్లు, టీ పొడి, ఫ్రిజ్ లు తగలబడి పోయాయి , వీటి విలువ సుమారు రూ. 3 లక్షల ఉంటుందని కృష్ణారెడ్డి తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa