చంద్రబాబు అధికారంలోకి వస్తే దోచుకో.. పంచుకో.. తినుకో (DPT) పద్ధతి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే నిజమవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసే పనిలో పడింది. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టి వీటిలో 5 మెడికల్ కళాశాలలను పూర్తి చేశారు. మిగిలిన 12 కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమయ్యాడు. గుజరాత్ మోడల్ పీపీపీ ( Public–private partnership)ను ఇక్కడ అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల ముందు నారా లోకేష్ అయితే ఎంబీబీఎస్ సీట్లను జగన్ అమ్ముకుంటున్నాడంటూ గగ్గోలు పెట్టి. అధికారంలోకి రాగానే మాట మార్చి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరొక మాట చెప్పడానికి తండ్రీ కొడుకులిద్దరికీ సిగ్గుగా అనిపించట్లేదా