విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేశ్ ను గురువారం రాజంపేట పార్లమెంట్ టీడీపీ కోశాధికారి సీతప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు ఆసుపత్రిగా మార్చాలని, చెంబకూరుకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. మంజూరుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు.