ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు పక్షపాతిగా ఉంటామని హామి ఇచ్చి నేడు పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్ ఎక్స్ వేదిక ద్వారా ఆరోపించారు. ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడి కి రైతుల బాధలు కనిపించడం లేదని విమర్శించారు.పల్నాడు జిల్లా లో విత్తనాల కోసం రాత్రివేళల్లో క్యూలైన్లో నిలబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కుండపోత వర్షంలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని తెలిపారు.కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో జతకట్టి , రైతు పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి నేడు నిర్లక్ష్యం చేయడం సర్కార్‌కు న్యాయమా అంటూ ప్రశ్నించారు. రైతులకు అవసరమైన జేజీఎల్ 384 రకం విత్తనాలను పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.