ఆదివాసి దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని.. మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసులు ఉన్నారని తెలిపారు. దాదాపు 5% ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారన్నారు. గురువు లేకుండా విద్య మీద ఫోకస్ పెట్టి విల్లు విద్యను నేర్చుకున్న ఆదర్శవంతుడు ఏకలవ్యుడు అని.. ఆయన గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు. గిరిజనులు పండించే కాఫీకి తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. అరకు కాఫీ గురించి ప్రపంచ వ్యాప్తంగా పేపర్లు సైతం కొనియాడాయన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు పేర్కొన్నారు. మైదానంలో నివసించే గిరిజనులు అందరికంటే వెనుకబడి ఉన్నారన్నారు.