రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దాడి ఘటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి అని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్ చేసారు. అయన మాట్లాడుతూ.... ఈ దాడిపై మౌనం వహించడం సరికాదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై, విగ్రహాలు, శిలాఫలకాలపై దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు. ఈ దాడులపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ దాడులపై జాతీయ స్థాయిలో సంఘాలకు, పార్టీల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం అని హెచ్చరించారు.