విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన పాయకాపురం ప్రాంతంలో ఆదివారం జరిగింది. రామవరప్పాడుకు చెందిన యలమల కరుణకుమార్(27) కబ్బోర్డు మేస్త్రీగా పని చేస్తున్నాడు. సుందరయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పని కోసం ఆదివారం వచ్చాడు. భవనం 1వ అంతస్తులో కరుణకుమార్ పొడవాటి అల్యూమినియం బద్దీలతో పని చేస్తుండగా అవి విద్యుత్ సర్వీస్ వైర్లు తగిలాయి. విద్యుదాఘాతానికి గురైన కరుణకుమార్ను తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. నున్న రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.