రాష్ట్రంలో ఏం జరిగినా దానికి వైయస్ జగన్ గారిని బాధ్యులను చేస్తూ చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్ కొట్టుకుపోతే దానికి జగన్ గారు ఎలా బాధ్యులు అవుతారు? డ్యామ్ నిర్వహణ బాధ్యత తుంగభద్ర బోర్డుదితుంగభద్ర డ్యామ్ నిర్మించి 71 ఏళ్లు అయింది. నిజానికి ఆ ప్రాజెక్టు గ్యారెంటీ పీరియడ్ 45 ఏళ్లు మాత్రమే. ఇవన్నీ విస్మరించి ఏం జరిగినా.. అన్నింటికి వైయస్ఆర్ గారు లేదా జగన్ గారిని బాధ్యులను చేయడం చంద్రబాబు కి అలవాటుగా మారింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో పులిచింతల ప్రాజెక్టులో 16వ గేట్ కొట్టుకుపోతే, కేవలం 20 రోజుల్లో దాన్ని రిపేర్ చేశాం. ఆనాడు చంద్రబాబు, ఎల్లో మీడియా బురద రాతలు రాశాయి.