యువతే దేశానికి వెన్నుముక అని, యువశక్తి ఎంతో గొప్పదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం అన్నారు. శ్రీకాకుళంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురష్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్పప్నిల్ దినకర్, జెసీ ఫర్మాన్ అహ్మద్ పాల్గొన్నారు.