అమెరికాలోని కెంటకీలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. మత విద్వేషంతో కొందరు దుష్టులు విగ్రహం, ఆలయ గోడలపై నల్ల రంగు చల్లడంతోపాటు ప్రధాన హాల్‌లోని కుర్చీలో కత్తిని దింపారు. లూయిస్‌విల్లేలోని ఈ హిందూ ఆలయంలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య ఈ దారుణం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
విగ్రహంపై నల్ల రంగు చల్లడంతోపాటు కిటికీలను పగలగొట్టడం, గోడలపై స్ప్రే పెయింట్‌తో అనుచిత వ్యాఖ్యలు రాయడం లాంటి పనులకు పాల్పడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. జీసస్ మాత్రమే దేవుడనే వ్యాఖ్యలను గోడలపై రాసినట్టు సోషల్ మీడియాలోని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఈ ఘటన కెంటకీలోని భారతీయులను కలచి వేసింది. అమెరికా అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్రాడ్స్‌టౌన్ రోడ్‌లో ఉన్న స్వామినారయణ్ ఆలయాన్ని సందర్శించిన లూయిస్‌విల్లే మేయర్ గ్రెస్ ఫిస్చెర్ ఈ ఘటనను ఖండించారు.