పాలకొండ జల వనరుల కార్యాలయానికి పాలకొండ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మంగళవారం పరిశీలించారు. రైతులకు సంబంధించిన పలు అంశాలను స్థానిక అధికారులతో మాట్లాడారు. కార్యాలయం శిథిలావస్థకు చేరిందని. కొత్త కార్యాలయం నిర్మాణం చేపట్టాలని పరిస్థితిని సిబ్బంది ఆమెకు వివరించారు. ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదని వాపోయారు.