ఉద్యోగులకు బదిలీలు జరగకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, జీరో సర్వీస్ తో బదిలీలు జరిగితే ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జిల్లాల విభజన ఆఘమేఘాల మీద జరగడం వల్ల ఉద్యోగుల విభజనలో చాలా మందికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగులు తమ కుంటుంబాలకు దూరంలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.