అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నగర పరిధిలో 2014, 2019 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వాలు చేపట్టిన గృహ నిర్మాణాలను మంగళవారం ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అప్పటి నిర్మాణాలలో జరిగిన లోటుపాట్లు గుర్తించి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా నాణ్యమైన నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నట్టు తెలిపారు.