చదువుకుని ఎంతో గొప్ప భవిష్యత్తును చూడాల్సిన నేటి యువతరం మత్తుపదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారు. యువతే టార్గెట్‌గా కొందరు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ పబ్బం గడుపుతున్న పరిస్థితి. మత్తుపదార్థాలకు అలవాడు పడిన యువత తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. కన్నవారికి తీవ్ర ఆవేదనను మిగులుస్తున్న పరిస్థితి. మరోవైపు దేశంలో ఏ ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలాలు ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి. డ్రగ్స్ విక్రయదారులు లేదా కొనుగోలుదారులు రాష్ట్రానికి చెందిన వారు ఉండటం తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఈ క్రమంలో అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలనపై ఏలూరులో పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.