తుంగభద్ర డ్యాం నుండి లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమస్యతో విలువైన సాగు, తాగు నీటిని కోల్పోతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గేట్ల ఏర్పాటులో కీలకమైన కన్నమ్మ నాయుడు నేతృత్వంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు కష్టతరమైన పని చెప్పారు. డ్యాం వద్ద 1625 అడుగులు నీరు ఉండగానే గేట్లు అమర్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.