గర్భిణులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి పేర్కొన్నారు. ఆమె సోమవారం చిలమత్తూరు మండలంలోని చాగలేరు గ్రామం లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భిణులకు పసుపు, కుంకుమ, చీరలు అందజేశా రు. అనంతరం చాగలేరులో శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు నీరందించారు. టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి, జడ్పీటీసీ అనూ ష, నా యకులు అంజినప్ప, బేకరీ గంగాధర్, కొడికొండ బాలాజీ, నందీష ప్ప, ఆశ్వత్థప్ప, శ్రీదేవి, ఐసీడీఎస్ సీడీపీఓ రెడ్డిరమణమ్మ ఉన్నారు.