మండల అభివృద్ధికి అధికారులంతా కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం జరిగిన లావేరు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా పలు శాఖల అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మండల అభివృద్ధి లక్ష్యమని అన్నారు. అధికారులు ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలని సూచించారు.