అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేసింది యోగి సర్కార్.భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలకు లైట్లను అమర్చింది. వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను చోరీ చేశారు దుండగులు..వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఆలయ ట్రస్టు వాళ్ళు పోలీసులకు తెలిపారు.. ఫిర్యాదు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.