సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉన్నారని సీబీఐ విచారణకు ఆదేశించడం సబబు కాదని ముకుల్ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే ఇందులో ఐదు కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులు సమీక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు.