కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం హోసూరులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కళ్లలో కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దుండగులు నరికి చంపేశారు. ఏపీలో టీడీపీ కూటమి దాదాపు అన్ని చోట్ల భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ విజయానికి చాలా మంది నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేశారు. వైసీపీ ఆగడాల కారణంగా విసిగిపోయిన ప్రజానీకమంతా కూటమికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలోనే హోసూరు గ్రామంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు జరిగి రెండు నెలలు అవుతున్నా కానీ వారిలోని ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హోసూరులోనూ టీడీపీకి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో తమ గ్రామంలో భారీ మెజారిటీ రావడానికి శ్రీనివాసులే కారణమని భావించారు. సమయం చూసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఊరి బయట కళ్లో కారం కొట్టి వేట కొడవళ్లతో దారుణాతి దారుణంగా నరికి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్యోదంతంపై స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి శ్యాంబాబు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాసులు హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.