ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా వారితో చర్చలకు కార్యాచరణ రూపొందించనున్నారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్ వేర్ రంగం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రియల్ టైమ్ గవర్నెస్ వ్యవస్థను ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపైనా నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.