రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, త్వరలో అగ్రశ్రేణి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించబోతోందని అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు ఊపందుకున్నాయని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు సంవత్సరానికి సగటున 8 శాతం వృద్ధి రేటుతో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.