కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుంది.