బ్రిటన్ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా మన దేశం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటోంది. కానీ పంద్రాగస్టున ఇండిపెండెన్స్ డే చేసుకునే దేశాలు ఇంకా ఉన్నాయి. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా 1945లో జపాన్ నుంచి స్వేచ్ఛను పొందాయి. ఇక బ్రిటిష్ నుంచి బహ్రెయిన్‌కు, ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జర్మనీ నుంచి లీచెన్‌స్టైన్‌కు కూడా ఆగస్టు 15నే స్వాతంత్ర్యం లభించింది.