వెస్ట్ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌ని అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హింసించి హత్య చేశారని ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. డాక్టర్ హత్యని నార్మల్ సంఘటనలా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తుని చూస్తుంటే బాదేస్తుందని చెప్పారు. గురువారం నాడు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా సమయంలో ఎంతో మంది డాక్టర్లు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైనీ డాక్టర్‌ని చాలా హింసించి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి కూతురి మొఖం కూడా చూపించలేదని వాపోయారు. వైద్యురాలిని చంపిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలను సమాజం ఉపేక్షించకూడదని చెప్పారు. అక్కడ సాక్ష్యాలని కొందరు దుండుగులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. ప్రొటెస్ట్ చేసేవారిపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులని వెంటనే కఠినంగా శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.