భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆకాంక్షించాడు. ‘‘పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌పై అర్షద్ నదీమ్ ఆధిక్యం సాధించాడు. ఇలాంటిసమయంలో దాయాదిదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే బాగుంటుంది. క్రికెట్ సిరీస్‌లు కష్టమే. అందుకే హాకీ, కబడ్డీ, జావెలిన్‌త్రో సిరీస్‌లను నిర్వహించాలి. నదీమ్, నీరజ్‌ల మధ్య జావెలిన్ త్రో సిరీస్ జరిగితే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు.