అర్జెంటీనా మాజీ అధ్యక్షుడిపై ఆల్బర్ట్ ఫెర్నాండెజ్‌పై కేసు నమోదైంది. తనపై మానసిక వేధింపులు, భౌతిక దాడి చేశారని ఆయన మాజీ భార్య ఫాబియోలా యానెజ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బ్యూనస్ ఎయిర్స్ ఫెడరల్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ ఆరోపణలు ఆల్బర్ట్ ఫెర్నాండెజ్ ఖండించారు. వాస్తవాలు కోర్టులో తేలుతాయని వ్యాఖ్యానించారు. కాగా, ఆయన అర్జెంటీనా అధ్యక్షుడిగా 2019 నుంచి 2023 వరకు పనిచేశారు.