బాపట్ల జిల్లా అద్దంకి మండలం బాలరాంకృష్ణపురం వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa