నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు. రోజుకు రెండు లక్షల 25 వేల మంది అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్లన్నారు. పేదలకు అవసరమైన ప్రదేశాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని.. వంద రోజుల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశామననారు. మిగిలినవి సెప్టెంబర్ నెల ఆఖరిలోగా ఏర్పాటు చేస్తామన్నారు.పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం 5 రూపాయలకే మూడు పూటలా అందిస్తున్నాం. చాలామంది దాతలు అన్నా క్యాంటీన్లకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. దాతలు ఇచ్చిన నిధులతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.