సముద్రంలో తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న అభియోగాలతో శ్రీలంక నావికా దళం ఇటీవల అరెస్టు చేసిన తమిళనాడుకి చెందిన 13 మంది మత్స్యకారులు శుక్రవారం తమ స్వస్థలాలకు పంపించింది. ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. 17 రోజుల తర్వాత వారిని భారత్‌కు రప్పించగలిగామని పేర్కొంది. ఇదివరకు కొలంబో నావికా దళం అరెస్టు చేసినవారిలో 21 మంది భారత మత్స్యకారులను ఈ నెలలో చెనురుకి తిరిగి రప్పించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa