ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ కి ఇంకా బుద్ధి రాలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:31 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 11సీట్లకు పడిపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం మానడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన సొంత పేపర్, టీవీ ఛానెల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వీఆర్‌కు పంపడంపై ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని, వైసీపీ హయాంలో ఏం జరిగిందో గుర్తు లేదా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికారుల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి చేసేలా బ్లూ మీడియా ప్రచారాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.." తప్పు చేసిన అధికారులను వీఆర్‌లో పెట్టడం ప్రభుత్వ విధానం. అలాంటి అధికారులు తమ ఉద్యోగ ధర్మాన్ని చట్టబద్ధంగా నిర్వహిస్తారని పైఅధికారులు భావించినప్పుడు వారికి తిరిగి రెగ్యులర్ డ్యూటీ ఇస్తారు. వైసీపీ హయాంలో జుడీషియల్ కస్టడీలో ఉన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని వీఆర్‌లో పెట్టడం తప్పా?. భార్యభర్తల కేసులో డబ్బులు కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారిని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఓ ఐఏఎస్ అధికారిని వీఆర్‌కు బదిలీ చేయడం ఏ విధంగా తప్పు అవుతుందని ప్రశ్నించారు. అలాంటి వారిని వీఆర్‌కు బదిలీ చేయడం ఆటవికదాడి అవుతుందా?. అసలు వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వీఆర్‌కు పంపడం తప్పని భావించివారు దమ్ముంటే చర్చకు రావాలని" సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com