రాజకీయాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందించాలంటే అందరి సహకారం అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తాము 2014 నుంచి 2019 వరకు వేలకోట్ల నిధులు తెచ్చి పంచాయ తీలను అభివృద్ధి చేశామన్నారు. అయితే గత ఐదేళ్లుగా అభివృ ద్ధి కుంటుపడిందన్నారు. వేలకోట్ల రూపాయల పంచాయతీ నిధులను అప్పటి ప్రభుత్వం దారి మళ్లించడంతో పంచాయతీ పాలన అస్తవ్యస్తమైందన్నారు. రా త్రికి నిధులు ఖాతాలోకి వేసినట్లు చూపిస్తూ తెల్లారేసరికి ఖాళీఖాతా చూపిం చడం గత ప్రభుత్వానికే చెల్లిందన్నారు. గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే త్వరలోనే రూ. 20 కోట్ల నిధులతో మండలంలో అభివృద్ధి పను లు చేపడుతామన్నారు. వచ్చే ఆరునెలల్లోగా రూ. 35.40 కోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. అధికారులు ప్రజలకు సహకరించి మంచి సేవలను అందించాలన్నా రు. గ్రామపంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా మన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం సర్పంచులు వన్నూరుస్వామి, మల్లేశప్పరప్ప, రాజశేఖర్‌రెడ్డి, వన్నూరుస్వామి, రాధమ్మతో పాటు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఎంపీపీ విద్యావతి శాలువాలు, పూలమాలలతో ఎమ్మెల్యేని సత్కరించారు. తహసీల్దార్ రఘు, ఏఓ మహేంద్ర, హార్టికల్చర్ అధికారి మౌనిక, జడ్పీటీసీ మల్లికార్జున, ఎంఈఓలు నాగమణి, వెంకటరమేష్, వైద్యులు సూర్యనారాయణరెడ్డి, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.